బెంగుళూరులో బార్ గర్ల్స్ పై 8మంది గ్యాంగ్ రేప్
posted on Oct 21, 2012 @ 11:12AM
బెంగుళూరులో కేసినో బార్ లో పనిచేసే ముగ్గురు యువతులపై ఎనిమిదిమంది యువకులు అత్యాచారం చేసి, ఇంట్లోని నగలు, వస్తువులు తీసుకొని పారిపోయారు. కేసినో రాయల్ బార్ లో మద్యం సరఫరా చేసే ముగ్గురు యువతులు కెంచనాపురంలో ఓ ఇంట్లో ఉంటున్నారు. వీరికి రక్షణగా ముగ్గురు యువకులు కుడా ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో రెండు కార్లలో వచ్చిన ఎనిమిది మంది యువకులు వీరి ఇంటిపై దాడి చేసి, అందులో ఉన్న యువకుడిని కొట్టి ముగ్గురు యువతులపై అత్యాచారం చేశారు. వారి ఇంట్లో ఉన్న నగలు, మొబైల్ ఫోన్లు, టీవీ, డీవీడీ తదితర వస్తువులను పట్టుకెళ్లారు. రామ్‌నగర్ జిల్లా ఎస్పీ అనుపమ్ అగర్వాల్ ఘటనాస్థలానికి చేరుకుని యువతులను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. దుండగుల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపారు.