టాప్ సీడ్ చైనా వాంగ్‌కు షాకిచ్చిన సైనా
posted on Oct 21, 2012 @ 12:33PM
ప్రతిష్ఠాత్మక డెన్మార్క్ ఓపెన్‌లో టాప్ సీడ్ చైనా యిహాన్ వాంగ్‌పై తొలి సారి గెలిచిన సైనా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ యిహాన్ వాంగ్‌పై గెలిచి లండన్ ఒలింపిక్స్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్‌లో మూడో సీడ్ సైనా 21-12, 12-7తో యిహాన్‌ను చిత్తుచేసి జర్మనీకి చెందిన జులియన్ షెంక్‌తో టైటిల్ పో రుకు సిద్ధమైంది. తొలిగేమ్ నెగ్గిన సైనా రెండోగేమ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నపుడు. యిహాన్ మోకాలి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఇంతకు ముందు ఈ ఇద్దరూ ఆరు సార్లు తలబడగా.. సైనాను ఒక్క సారి కూడా విజయం వరించలేదు. ఫైనల్లో తలపడబోయే జులియన్ షెంక్‌పై సైనాకు మంచి రికార్డే ఉంది. ఇంతకు ముందు వీరిద్దరరూ ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడగా.. సైనా ఐదు సార్లు విజేతగా నిలిచింది.