పాక్ జట్టులో విభేదాలు
posted on Oct 7, 2012 @ 3:01PM
టీ20 ప్రపంచకప్ సెమీస్ నుంచి వైదొలిగిన అనంతరం జట్టు ఓటమిపై పాక్ టీంలో విభేదాలు భగ్గుమన్నాయి. శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో తనను తీసుకోకపోవడంపై ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీలంక నుంచి లాహోర్‌కు తిరిగొచ్చిన రజాక్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. సెమీస్‌లో తాను ఆడకుండా కెప్టెన్ హఫీజ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు. జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకోలేదని, కెప్టెనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆరోపించారు. మరోవైపు పాక్‌కు చేరుకున్న కెప్టెన్ హఫీజ్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. సెమీస్‌లో అతడికి చోటు కల్పించకపోవడం జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయమేనని స్పష్టం చేశాడు.