రాబర్ట్ వాద్రాపై పై విచారణ అసాధ్య౦: చిదంబరం
posted on Oct 7, 2012 @ 3:51PM
రాబర్ట్ వాద్రాపై పై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే రాబార్ట్ అవినీతిపై విచారణ జరిపించాలని చాలా మంది సవాల్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాబర్ట్ పై విచారణ జరపడం అసాధ్య మంటున్నారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీని ఆరోపణలు వచ్చాయనో లేదా అవినీతి చర్యగానో భావించో ప్రశ్నించడానికి వీల్లేదు. ఈ లావాదేవీలను ఆదాయం పన్ను శాఖ రిటర్న్‌లు, ఇతర రిటర్న్‌లలో వెల్లడించారు కూడా. అంతేకాకుండా పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని కానీ లేదా అవినీతి ఉద్దేశాలు ఉన్నాయని కానీ ఎవరూ ఆరోపించలేదు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని చిదంబరం అన్నారు.