మళ్లీ మోడీ రాజ్యమే
posted on Oct 31, 2012 @ 1:59PM
గుజరాత్ ఓటర్లు మళ్లీ మోడీకే పట్టం కట్టాలని చూస్తున్నరు. తాజా సర్వేల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియా టుడే జరిపిన సర్వేలో అరవై శాతంమందికిపైగా గుజరాత్ ఓటర్లు మోడీవైపే మొగ్గుచూపుతున్నట్టు తేలింది. మైనారిటీల్లోకూడా మోడీని ఇష్టపడేవాళ్ల శాతం అరవైని మించిపోయింది.
మోడీ డైనమిజం, అభివృద్ధి మంత్రం.. గుజరాత్ మీద బాగా పనిచేశాయి. గోద్రా అల్లర్లమచ్చని చాకచక్యంగా తుడిచేసుకోగలిగిన మోడీకి దేశంలోనే కాదు యూకేలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అల్లర్లలో నష్టపోయినవాళ్లకి మోడీ పూర్తి న్యాయం చేశారని నమ్ముతూ ఇటీవలే యూకే.. గుజరాత్ పై ఆర్థిక ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసింది. ఇంకా చాలా దేశాలనుంచి గుజరాత్ కి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయ్.
మూడోసారికూడా మోడీకే పట్టం కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న వార్త బిజెపితోపాటు ఇతర పార్టీల్లోనూ క్రేజ్ పుట్టిస్తోంది. రాబోయే రోజుల్లో కాబోయే ప్రథాని అభ్యర్థి అన్న ప్రచారానికి రోజురోజుకీ బలం పెరుగుతోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ తరఫున ప్రథాని పీఠానికి రాహుల్ గాంధీ పోటీ పడితే బిజెపి తరఫున మోడీ బరిలోకి దిగుతారని దేశంలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అదే గనక జరిగితే రాహుల్ తో పోలిస్తే మోడీకే ఎక్కువ చరిష్మా ఉంది కనక ఆయనకే ప్రధానిపదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కమలనాధులు గట్టిగా చెబుతున్నారు.