ఒక్కసారి తినిచూడండి... ఆపైన!
posted on Sep 29, 2012 8:00AM
వచ్చే నెల 1వ తేదీ నుండి ఎసి తరగతి ప్రయాణ టికెట్, రవాణా ఛార్జీలతో పాటు రైల్వేస్టేషన్లలో ఆహారపదార్ధాల ధరలనుకూడా కేంద్రం పెంచబోతోందట! రవాణా ఛార్జీలపై సేవాపన్ను నుండి ఆహారధాన్యాలు, పెట్రో ఉత్పత్తులు, కొన్ని రకాల నిత్యావసరాలు (అంటే పప్పులు, పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు, చక్కెర, పిండ్లు, పొడులు, రసాయన ఎరువులు, జనుము, నూనె గింజలు, ఎండు మిరప, జీలకర్ర, మిరియాలు, పత్తి, వక్క మొదలైనవి) సర్కారు మినహాయించింది. బహుశా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను చూసి రైల్వే ప్రయాణ ధరలు, అక్కడి ఆహార పదార్ధాల ధరలు పెంచబోతోందేమో! చేతిలో కలం వుందని సంతకం పెట్టేస్తారు. పెంచేస్తారు! అయితే అసలు రైల్వే స్టేషన్‌లో ఆహార పదార్ధాలను ఎప్పుడైనా ఓసామాన్యుల్లా ఆర్డరు వేసి తిన్నారా? తిని చూడండి. ఆ తర్వాత ఆ పదార్ధాలకు పెంచడం సమంజసమో, కాదో వారికే తెలుస్తుంది. నాణ్యతలను పట్టించుకోరు. కళ్లున్న గాంధారిలా తయారయింది ఈ ప్రభుత్వం... అని వాపోతున్నారు సామాన్య ప్రజలు.