అమెరికాలో తెలుగు యువకుడు హర్ష మృతి
posted on Sep 29, 2012 9:24AM
అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న మద్దుల హర్ష (19) మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. పార్టీ ఉన్నదని స్నేహితులతో కలిసి అప్పటికి రెండురోజులక్రితం క్యాంపస్ నుంచి వెళ్లిన హర్ష తిరిగి రాలేదనేది సమాచారం. అప్పటి నుంచి కుటుంబ సభ్యు లు పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో హర్ష మృతదేహాన్ని విల్స్ మెట్ హార్బర్‌లో గుర్తించారు. ప్యాంటు జేబులో ఫోన్, గుర్తింపు కార్డు, పర్సు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హర్ష ఎలా చనిపోయాడన్నది తెలియట్లేదని, అయితే అనుమానాస్పద అంశాలు కూడా ఏవీ లేవని వారు చెప్పారు. హర్ష మధుమేహంతో బాధపడుతున్నాడని, సమయానికి మందులు తీసుకోకపోవడం వల్లే అతడు మరణించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.