టిడిపీ ముస్లీం ఎంపవర్ మెంట్ పాలసీ
posted on Sep 28, 2012 @ 6:41PM
65 ఏళ్ళ స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ముస్లీంలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా చూసింది తప్పవారిని అభివృద్ధిపరచలేదని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముస్లీం, మైనార్టీ వర్గాల సమావేశంలో విమర్శించారు. ముస్లీంల అభివృద్ధి కోసం వార్షిక బడ్జెట్ లో సబ్ ప్లాన్ కింద రూ. 2500 కేటాయింపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీంలకు 15 సీట్లు, చట్టసభల్లో 8% రిజర్వేషన్లలకు కృషి మరియు తదితర అంశాలతో కూడీన ముస్లీం ఎంపవర్ మెంట్ పాలసీనీ ప్రకటించారు. మైనార్టీలకు ఏదైనా అభివృద్ది జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీ హయంలో తప్ప కాంగ్రెస్ వారు పట్టించుకోలేదన్నారు. ఉర్దూ భాషను 2వ అధికార భాషగా 14 జిల్లాల్లో అమలు చేశామని, ప్రత్యేక డియస్సీ ద్వారా రెండువేళమంది ఉర్దూ టీచర్ల్లను నియమించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయంలో ముస్లీంలకు రెసిడెన్సియల్ స్కూల్ లు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, దేశంలో తొలిసారిగా ముస్లీంలకు ఫైనాన్స్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకించి హజ్ యాత్రికుల సౌకర్యార్ధం హైదరాబాద్ లో హజ్ హౌస్ ను, షాదీఖానాలు నిర్మించామన్నారు.