నామినేటెడ్ పదవులపై ఆరంభం లోనే అసంతప్తి
posted on Oct 23, 2012 @ 3:04PM
ఎప్పుడెప్పుడా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తారా అని ఎదురు చూసిన అధికార కాంగ్రెస్ వర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణీ నాయకులు మొదట్లోనే అసంతప్తి చెందుతున్నారు. విజయ దశమిని పురస్కరించుకొని సోమవారం రాష్ట్రస్దాయి పోస్టులను ప్రకటించారు. అందులో అధికార బాషాసంఘం అద్యకడుగా కష్ణాజిల్లాకు చెందిన మండలి బుద్ద ప్రసాద్ ను, మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా మంత్రి నేదురు మిల్లి రాజ్యలకిని నియమించగా మైనార్టీ కమీషనర్ గా అభిద్ రసూల్ ఖాన్ పేర్లు ఖరారు కావడంతో రాష్ట్రంలోని బిసిలు డీలా పడుతున్నారు. రాష్ట్రస్దాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో అధిష్టానం సూచించిన పేర్లను సీ ఎం ఖరారు చేయగా మిగిలిన పోస్టులకు గానూ సీఎం, బొత్సా లు ప్రత్యేక దష్టి సారిస్తారు. అసంతప్తులు వెల్లువ కాకుండా జాగ్రత్తగా ఉండండని ముందే అధిష్టానం కోరింది. అయితే ప్రస్తుతం నామినేటెడ్ పదవులకు నియమితులైన రాజ్యలక్మి, మండలి ఇద్దరూ పార్టీ కార్యక్రమాలకు హాజరు కానివారని, గాందీభవన్ లో నిర్వహించే ఏ మీటింగ్ కూ వచ్చిన పాపాన పోలేదని అటువంటి వారికి పదవులు కట్టబెట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా ఉండే యువతకు ఇచ్చినట్లయితే బావుండేదని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇకనుండైనా ద్వితీయ శ్రేణులకు, బిసిలకు పదవులను ఇస్తూ అన్ని పార్టీలు బిసిలకు పెద్ద పీట వేస్తుంటే కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా వ్వవహరిస్తుందని, పార్టీలోని మాజీలకు కాకుండా యువతకు ప్రాధాన్యత నివ్వడం ద్వారా రానున్న ఎన్నికలకు సిద్దమవ్వాలని నాయకులు కోరుతున్నారు