పారిశ్రామిక వర్గాలకు దసరా చేదు
posted on Oct 23, 2012 @ 3:06PM
కార్మికులకు రెండే పెద్ద పండుగలు ఉంటాయి. ఒకటి దసరా కాగా రెండోది సంక్రాంతి. ఈ రెండు పండుగలకు ప్రతి యాజమాన్యం తమ దగ్గర పని చేసే కార్మికులకి కొత్త బట్టలు, స్వీట్లు, బోనస్ ఇచ్చేవి అయితే ఈ సంవత్సరం దసరా ఒక చేదు అనుభవాన్ని మాత్రమే ఇస్తుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన నిర్వాకానికి గానూ విద్యుత్ కోతలతో పరిశ్రమలు అతలాకుతమయ్యాయని దాంతో కార్మిక వర్గాలకు మొత్తం జీతం ఇచ్చే పరిస్థితుల్లో లేమని ఇటువంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని ఆవేదని వ్యక్తం చేశారు. వారంలో మూడు రోజులు పారిశ్రామిక వాడలకు ఫవర్ హాలిడే రోజుకు 9 గంటలు మాత్రమే ఉంటే కరెంటు వల్ల ఉత్పత్తిని పెంచడం కాదుకదా ఆర్డర్లకు సరిపడా కూడార ఉత్పత్తి చేయలేకపోయామని దాంతో ఆర్డర్లు కూడా పోయాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. సగం సగం జీతాలతో ఇల్లు గడిచే పరిస్ధితే లేదని అటువంటి పరిస్ధితుల్లో ఇంకా పండుగ ఎక్కడిదని దిగాలుగా ప్రశ్నిస్తున్నారు శ్రామికులు. ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రభుత్వం కరెంటు కోతలను నిలుపు చేసి వేలాది పరిశ్రమలను ఆదుకోవాలని, లకలాది కుటుంబాలకు రానున్న సంక్రాంతికైనా తమను పండుగ చేసుకొనే అవకాశం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.