బీహార్ కు మోడీ రూ.1.25 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్

 

భారత ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి భారీ ప్యాకేజీను ఇస్తున్నట్టు ప్రకటించారు. బీహార్ లో జరిగిన ఆరా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్యాకేజీ వల్ల బీహార్ రాష్ట్ర పూర్తిగా అభివృద్ధి చెందాలని.. బీహారీల దశదిశ మారుతుందని తాను భావిస్తున్నానన్నారు. రైతుల సంక్షేమంతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమన్నారు. బీహార్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలే మార్చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు మరో రూ.40వేల కోట్ల రూపాయలను బీహార్ ప్రాజెక్టుల కోసం అదనంగా ఖర్చుపెడతామని ప్రధాని మోడీ చెప్పారు. కాగా ఈ బీహార్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.25వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనం చేశారు. 23 స్కిల్ ట్రెయినింగ్ సెంటర్లు ప్రారంభించారు.  
 


మరోవైపు ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు త్వరలో బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ ఈ ప్యాకేజీ ఇచ్చారని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి.

Teluguone gnews banner