కేటీఆర్ గన్‌మన్‌, డ్రైవర్లకు అరెస్ట్ వారెంట్లు!

 

ఓటుకు నోటు కేసులో కేటీఆర్ గన్‌మన్‌, డ్రైవర్లకు నోటీసుల ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరు విచారణకు హాజరుకాని నేపథ్యంలో ఏపీ సీఐడీ తదుపరి చర్యలకు సన్నద్దమవుతోంది. ఇద్దరికి అరెస్ట్ వారెంట్ లు జారీచేసే యోచనలో ఉంది. ఈ కేసు వ్యవహారంలో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్యను బెదిరించారనే ఆరోపణలపై వీరిద్దరికి నోటీసులు జారీ చేశారు.. మొదట నోటీసులు ఇచ్చేందుకు కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి.. తరువాత ఇంటికి వెళ్లినా కానీ వారు మాత్రం అందుబాటులో దొరకలేదు. దీంతో ఏపీ అధికారులు తెలంగాణ ఐఎస్‌డబ్ల్యూ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ వద్దకెళ్లి నోటీసులు అందించి, రశీదులు తీసుకొని సోమవారం ఎట్టిపరిస్థితిలోనూ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ జానకీరాం, సత్యనారాయణ మాత్రం నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు హాజరుకాకపోవడంతో ఏపీ సీఐడీ అధికారులు వారిద్దరికి కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

Teluguone gnews banner