చిరంజీవి పై మోహన్ బాబు సెటైర్!
posted on Apr 23, 2013 @ 2:19PM
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎలాంటి వేదికైనా, ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనుకొని పరోక్షంగా సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా మోహన్ బాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను మళ్లీ రాజకీయాలలోకి వస్తానని, అయితే ఏ పార్టీలో తాను చేరేది త్వరలో చెబుతానని, పార్టీ పెట్టే ధైర్యం లేదని, ఆ పార్టీ పెట్టి సంపాదించుకునే ధైర్యం కాని లేవని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
తనకు పదవులపై ఆసక్తి లేదనీ, తాను రాజకీయాల్లోకి వస్తే పదవులు ఆశించనని, ప్రచార బాధ్యతలు మాత్రమే చూస్తానని అన్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరని సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని అన్నారనే చర్చ సాగుతోంది. అయితే కొందరు మాత్రం మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అన్నాడని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయడంపై మోహన్ బాబు సెటైర్ వేసి ఉంటారని అనుకుంటున్నారు.