మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఆశ్వస్థత
posted on Apr 23, 2013 @ 2:42PM
ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య స్వల్పంగా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. కృష్ణాజిల్లా పోరంకిలోని ఆర్యవైశ్య సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రోశయ్య సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిణామంతో తేరుకున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హుటాహుటిన రోశయ్యను స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడినుండి రోశయ్యను విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి డాక్టర్లు రోశయ్యను మూడు గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. రోశయ్య ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పార్థసారథి వివరించారు. రోశయ్య అధిక రక్తపోటుతో బాధపడుతుండగా ఎమర్జెన్సీ వార్డ్ లో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని తెలిసింది.