ఆకర్షణగా నిలిచిన బాబు మనవడు దేవాన్ష్
posted on Oct 22, 2015 @ 1:49PM
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన అతిథులను చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఆకట్టుకున్నాడు, అమరావతి గ్యాలరీని తిలకిస్తున్న సమయంలో ప్రధాని మోడీ కూడా దేవాన్ష్ ను కొద్దిసేపు ముద్దుచేశారు, దేవాన్ష్ చేయి పట్టుకుని బుగ్గగిల్లి ముద్దులాడారు, తన కళ్లజోడును సరదాగా దేవాన్ష్ కి పెట్టారు, అంతకుముందు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా దేవాన్ష్ ను ముద్దుచేశారు, దేవాన్ష్ మెడలో రేవంత్ రెడ్డి అమరావతి కండువా వేయగా, అదేంటి టీడీపీ కండువా కదా వేయాలని చంద్రబాబు సతీమణి అనడంతో అక్కడ నవ్వులు విరిసాయి.