ఆసియాకి ఏపీ గేట్ వే - జపాన్ మంత్రి
posted on Oct 22, 2015 @ 1:38PM
అమరావతి రాజధాని నిర్మాణానికి తాము సహకరిస్తామని జపాన్ మంత్రి తకాచీ చెప్పారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తకాచీ... భవిష్యత్‌లో అమరావతి అద్భుత నగరంగా విరాజిల్లుతుందన్నారు. అమరావతికి విశిష్ఠ చరిత్ర ఉందని, అమరావతి నిర్మాణంలో తాము పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆసియా, ఫసిఫిక్ ప్రాంతానికి ఏపీ గేట్‌వే నిలుస్తుందని తకాచీ ఆకాంక్షించారు.