మొబైల్ లే ప్రాణం.....మొబైల్ వల్లే మరణం
posted on Oct 15, 2012 @ 1:24PM
మొబైల్ లేందే నిముషం కూడా గడవదు. సెల్ లో ఛార్జింగ్ అయిపోతే ఏంచెయ్యాలో తోచదు. గుడ్మార్నింగ్, నుండి గుడ్ నైట్ వరకు ఎంత సొల్లయినా సెల్ వల్లనే కదా...... తిండి, బట్ట తర్వాత సెల్ తోనే ప్రపంచం అయిపోయింది. ప్రపంచ జనాభా 700 కోట్లయితే దానిలో దాదాపు 600 కోట్లమందికి సెల్ ఫోన్లున్నాయి. చైనాలో 100 కోట్ల సెల్ లతో మొదటి స్ధానంలో ఉంటే ఈ సంవత్సరాంతానికి మనం కూడా 100 కోట్ల సెల్ ఫోన్ల వాడకంతో చైనాను చేరుకుంటాం. సెల్ చేతిలో ఉందంటే అరచేతిలో వైకుంఠం వున్నట్లే. ప్రతి ఏడాది మనదేశంలో సెల్ వాడకం 11 శాతం వరకు పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. 1973కి ముందే పోర్టబుల్ ఫోన్లు ఉన్నప్పటికీ 1990 కిఅందరికి తెలిసింది. మొదట్లో కేవలం డబ్బున్న వారికే పరిమితమైంది. తర్వాతి పరిణామంలో గ్లోబలైజేషన్ పుణ్యమా అని సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చాయి. నిజానికి 1983లోనే కమర్షియల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినా తొంభైయవ దశకంలో అందరికీ అందుబాటులోకి వచ్చాయి. మాట్లాడండి...మాట్లాడుతూనే వుండండి అంటూ సర్వీస్ ప్రొవైడర్లు చెబుతూ చెవూలూదరగొట్టినా.....అరనిముషం కన్నా తక్కువ వ్యవధిలో మాటను కలిపే యంత్రం సెల్ కాకుండా ఇంకేముంటుంది. అయిదారు సంవత్సరాల క్రితం కేవలం మాట్లాడటానికే ఉపయోగపడే మొబైల్ రోజురోజుకీ తన సేవలను పెంచుకుంటూ పోతుంది. ఈరోజు సరిక్రొత్త మోడల్ రేపటికి పాతబడిపోతుంది. ఇప్పుడు సెల్ ఫుల్ జీవితం మన ముందుంది. అంటె గుండె జబ్బులున్న వారికి డాక్టర్ ఎడ్యయిజ్ లతోపాటు, డాక్టర్ వచ్చేవరకు రోగికి సేవలు అందించే సరికొత్త మోడల్స్ మార్కెట్ లోకి రాబోతున్నాయి. సెల్ నుండి వెలువడే తరంగాలకు హాని కలిగించే వైరస్ ను చంపుతాయి. సెల్ ఈజ్ హెల్ అని పర్యావరణ వేత్తలు పిచ్చుకలు, తేనెటీగలు వీటివల్ల అంతమయ్యాయని, వీటివల్ల మతిమరుపు, డిప్రషన్ వస్తాయంటున్నారు. కాబట్టి మొబైలే ప్రాణం మొబైల్ వల్లే మరణం.