ఇంతకీ ఆ ముగ్గురు మంత్రులు పంజాబ్ ఎందుకు వెళ్ళారు
posted on Oct 15, 2012 @ 1:26PM
ముగ్గురు మంత్రులు పంజాబ్ వెళ్లారు ఎందుకంటె వరికి మద్దతు ధరలు ఎలానిర్ణయించాలా అని తెలుసుకోవడానికి వెళ్లారు. ఆ మంత్రులు వ్యవసాయ మంత్రి కన్నా లక్మీనారాయణ, రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి, ఫౌరసరఫరాల మంత్రి శ్రీధర్ బాబు వాళ్లంతా దాన్యం మద్దతుధర ఎలా నిర్ణయించాలని తెలుసుకోని వచ్చారు. దీనికి వారు మూడు రోజులు పంజాబ్ లో గడిపారు. పంజాబ్ ఏమన్న అధికార కాంగ్రెస్ దా అంటే అదీకాదు. వరి మన రాష్ట్రానికి కొత్తగా పండించిన పంటా అంటే అదీకాదు. మరి ఎందుకు వెళ్లినట్టూ .....వరినాటటానికి వర్షంలేదు. బోరువేధ్దామంటే కరెంటు ఇవ్వలేదు. ఎరువులకోసం క్యూలో నించుంటే పోలీసుల లాఠీలు రైతులపై విరిగాయి. మొత్తానికి కొన్ని జిల్లాలు క్రాఫ్ హాలిడే ప్రకటించేశారు.సీజన్ అయిపోయేవరకు ముఖ్యమంత్రితో సహా ఎవరూ రైతులకు చేసింది ఏమీ లేదు. పరిస్ధితులు అనుకూలించక వేల హెక్టార్ల పొలాలు పంటలు వేయకుండా పడి ఉన్న ఈ సంవత్సరంకి మద్దతు ధర కోసం మాత్రం అద్యయనం చేసివచ్చారా మంత్రివర్యులు. దీంతో సహచర మంత్రులే సెటైర్లు వేస్తూ నవ్వుకుంటున్నారట.