బాబుకు నీరాజనం పడుతున్న మేథావులు!
posted on Oct 15, 2012 @ 11:02AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా దాగుంది. ప్రజలు తమ తరుపున మాట్లాడగలమని భరోసా ఇచ్చేవారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తన వయస్సును సైతం లెక్కచేయకుండా తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు మీ కోసం వస్తున్నా పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర నిర్ణయం తీసుకోగానే సినీనిర్మాతలు, దర్శకులు, కొందరు విద్యావేత్తలు మద్దతు ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభం నుంచి చంద్రబాబు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల అవినీతిని ఎండగడుతూనే వచ్చారు. వీటితో పాటు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీని పిల్లకాంగ్రెస్ అని, అవినీతి ఊడ అని, తాజా అవినీతిపుట్టక ఉన్న పార్టీ అని రకరకాలుగా దునుమాడుతూనే వచ్చారు. ఆ పార్టీల్లోని నేతలపై కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి స్పందన రావటం ప్రారంభమైంది. ఇటీవల సిపిఐ చంద్రబాబు యాత్రలో జతకట్టింది. దీని తరువాత బాబు తనయాత్రలో భాగంగా పేదలను, మధ్యతరగతి వర్గాలను దగ్గర తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈయన పాదయాత్ర మరింత ఆకర్షణీయంగా మారింది. అసలు సమస్యలన్నీ ఎదుర్కొనే ఈ రెండింటిపై చంద్రబాబు దృష్టిసారించటం మేథావుల్లో కూడా ఆలోచనలు రగిలిస్తోంది. ఫలితంగా ఒక వర్గమైన ఐటీనిపుణులు బాబు బాహాటంగా తమ మద్దతు, లక్షరూపాయల విరాళం కూడా అందించారు. ఇలా మారుతున్న సమీకరణలు చూస్తుంటే ప్రభుత్వవ్యతిరేకతపై బాబు గురిపెట్టిన బాణం ఆయన్ని అందలం ఎక్కిస్తుందా? ఏమో! ఏమైనా జరగొచ్చంటున్నారు ఐటీనిపుణులు.