ప్రత్యెక రాష్ట్రం ఇస్తే రాజీనామా : కాసు వార్నింగ్..!
posted on Jan 7, 2013 8:19AM
కేంద్రం ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఇస్తే తాను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ర్ట సహకార శాఖ మంత్రి కాసు కృష్ణా రెడ్డి ప్రకటించారు. నిన్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను సమైఖ్యాంధ్ర ను కోరుకొనే కుటుంబంలో పుట్టానని కాబట్టి ఆ వాదమే తనకు ముఖ్యమని, పదవులు అసలు తనకు ఎంత మాత్రం ముఖ్యం కాదని కాసు అన్నారు. సమైఖ్యాంధ్ర కోసం తన బాబాయి ముఖ్య మంత్రి పదవినే కాసు బ్రహ్మానంద రెడ్డి త్యాగం చేసారని ఆయన గుర్తు చేశారు. తాను మంత్రి పదవికన్నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటమే ముఖ్యమని కాసు ప్రకటించారు.
కాసు చేసిన ఆ ప్రకటనను సమైఖ్యాంధ్ర జెఏసి స్వాగతించింది. మంత్రి చేసిన ఆ ప్రకటనను జెఏసి నాయకులు స్వాగతించారు. అప్పట్లో బ్రహ్మానంద రెడ్డి చాలా బలంగా నిలబడి రాష్ట్రం విడిపోకుండా చూసారనే అభిప్రాయం ఉంది. కాబట్టి కాసు ప్రస్తుతం ఇలా ప్రకటన చేయడం పెద్ద ఆశ్చర్యం కాకపోవచ్చు.