కావూరి ఫై కొల్లేరు లో కేసు నమోదు
posted on Jan 7, 2013 @ 10:17AM
ఏలూరు పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావు ఫై పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వన్య ప్రాణి చట్టం లోని కొన్ని నిభందనలను అతిక్రమించారని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.
కోమటిలంక రోడ్డు వివాదానికి సంభందించి ఈ కేసు నమోదు అయింది. ఆ గ్రామం వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణాన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన సమయంలో వారిఫై కావూరి దౌర్జన్యం చేశారనే ఫిర్యాదుతో ఈ కేసు నమోదు అయింది. కోల్లెరు లో కాంటూర్ తగ్గించాలంటూ స్థానికంగా ప్రజలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు కావూరి తన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి, ఇలా అధికారులఫై చేయి చేసుకోవడం ఎంత వరకూ సమంజసమో ఆయనో నిర్ణయించుకోవాలి. ప్రజల తరపున పోరాడటాన్ని ఎవరూ తప్పు బట్టరు. అయితే, ఇలా చట్టాన్ని అమలు పరిచే అధికారులఫై చేయి చేసుకోవడం మాత్రం తప్పే అవుతుంది.