రైలు ప్రమాదంలో మృతులకు 5లక్షల నష్ట పరిహారం:రైల్వే శాఖ మంత్రి
posted on Jul 30, 2012 @ 6:07PM
నెల్లూరులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముఖుల్‌రాయ్ ఆదేశించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారాన్ని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ డీకె సింగ్ విచారణ జరిపి ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోనున్నారు.