ఒలంపిక్స్ లో కాంస్యతో భారత్ బోని
posted on Jul 30, 2012 @ 9:48PM
న్యూఢిల్లీ:లండన్ ఒలంపిక్స్ 2012 క్రీడల్లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో పోటీలో కాంస్య పతకం గెలుచుకున్న హైదరాబాదీ ఏస్ షూటర్ గగన్ నారంగ్ ను ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. గగన్ నారంగ్ మరో రెండు పోటీలలో కూడా భారత్ కు విజయం చేకూర్చాలని ప్రధాని ఆకాక్షించారు. లండన్ ఒలంపిక్స్ లో భారత్ పతకాన్ని అందించిన తొలి భారతీయుడు గా గగన్ నారంగ్ నిలిచాడు.