విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ రాజీనామా
posted on Oct 26, 2012 @ 5:33PM
విదేశాంగశాఖ మంత్రి ఎస్.ఎమ్. కృష్ణ తమ పదవికి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేసినట్లు తెలియవచ్చింది. కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణకు రెండు రోజులు ముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఎస్ఎం కృష్ణ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వడంతో పాటు, అతనికి కర్నాటక కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. అందుకే అతను లావోస్‌లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నప్పటికీ దానిని రద్దు చేసుకొని రాజీనామాను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ సమయంలో మరికొందరు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.