జలదృశ్యం వద్దే బాపూజీ అంత్యక్రియలు
posted on Sep 22, 2012 @ 11:24AM
స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్‌బాపూజీ అంత్యక్రియలు జలదృశ్యంలో చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.శనివారం ఉదయం సీఎంతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి జానారెడ్డి భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నెక్లస్ రోడ్డులో , హుస్సేన్ సాగర్ ఒడ్డున ఎలాంటి కట్టడాలు ఉండరాదని కోర్టు ఆదేశాల రీత్యా ,కొంత సందేహ పడింది. అయితే తెలంగాణ వాదులు, తెలంగాణ కాంగ్రెస్ నేతల కోరిక మేరకు చివరకు ప్రభుత్వం జలదృశ్యంలోనే నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. దీనితో తెలంగాణ వాదులు అక్కడ అంత్య క్రియల ఏర్పాట్లు చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమ నేపద్యంలో దీనిపై వివాదం ఏర్పడకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. మరోవైపు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి బాపూజీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.