వేరే వాళ్లతో పెళ్ళి చేశారని లవర్స్ ఆత్మహత్య
posted on Sep 22, 2012 @ 12:12PM
బెంగుళూరుకి చెందిన రమేష్, సౌమ్య ఇద్దరు 2008లో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని వల్ల పెద్దలకు చెప్పారు కాని వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. రమేష్, సౌమ్య ఇద్దరికీ వేరే వాళ్ళతో పెళ్ళి చేశారు. వేరేవాళ్లను పెళ్లి చేసుకున్నప్పటికీ విడిగా ఉండలేక బెంగళూర్ - హైదరాబాద్ రహదారిపై గల యెలహంకలోని కొండప్ప లేఅవుట్‌లో అద్దె గదిలో వారిద్దరు ఉరివేసుకుని మరణించారు. ప్రేమికులిద్దరు చామ్‌నగర్‌లోని కొల్లెగళ్‌లో ఉండేవారు. సౌమ్యకు మాజీ భర్త, ఏడాది వయస్సు గల కూతురు ఉన్నారు. రమేష్‌కు భార్య ఉంది. అతనికి జనవరిలో వివాహమైంది. అతని భార్య ఆరు నెలల గర్భవతి.వారు కొల్లెగళ్‌లోని వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు. తాము కలిసి జీవించలేకపోయామని, అయితే తమ శరీరాలను కలిపి అంత్యక్రియలు చేయాలని, తాము ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని వారు సూసైడ్ నోట్‌లో రాశారు.