ఎన్నాళ్లో వేచిన హృదయం...
posted on Sep 21, 2012 @ 6:34PM
యూపిఎ సర్కార్‌కు తృణమూల్ కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్ర క్యాబినెట్ పునర్‌వ్వవస్థీకరణ జరిగే సూచనలు ఉన్నాయి. ముగ్గురు కొత్తమంత్రులను, కొందరు మంత్రుల శాఖలు మారవచ్చని తెలుస్తోంది. అయితే రాష్ట్రంనుండి మంత్రివర్గంలోకి ఒకరికి స్థానం లభించవచ్చునంటున్నారు. అది కూడా సురాజ్యంకోసంటూ ప్రజారాజ్యాన్ని ఏర్పాటుచేసి తర్వాతకాలంలో కాంగ్రెస్‌లో విలీనం చేసి అందులో ఇప్పటివరకు ప్రముఖనేతగా మారి, గత మంత్రివర్గ ఏర్పాట్లలో మంత్రిపదవి వస్తుందని లోలోపల ఆశించినా.. నేడు ఎన్నాళ్ళగానో ఎదురుచూపులు చూస్తున్న చిరంజీవికి ఆ మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని భావిస్తున్నారు. ఏమో.. అదే జరిగితే.. ఎన్నాళ్ళో వేచిన హృదయం.. ఈనాడే నిజమైందని సంబరపడతారు ఆయన అభిమానులు!