కేంద్రం చంద్రబాబుకు పవర్స్ ఇచ్చింది.. కోదండరాం
posted on Oct 25, 2015 @ 1:46PM
తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్స్ గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా తెలంగాణపై చంద్రబాబుకు కేంద్రం అధికారాల్ని కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన లాంటి అంశాలు చంద్రబాబు ఆదేశాల్ని బట్టి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అసలు హైకోర్టును విభజించాలని కేంద్రాన్నికోరితే చంద్రబాబు లేఖ రాస్తే తప్ప చేయమంటున్నారు.. ఒక రాష్ట్రపతి చేయాల్సిన పనిని చంద్రబాబు ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. ఉద్యోగుల విభజన పై ఏర్పాటు చేసిన కమల్ నాథ్ కమిటీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది.. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇంతవరకూ ఈ సమస్యకు ఓ కొలిక్కి తీసుకురాలేదు.. కావాలనే జాప్యం చేస్తుంది.. అక్కడ ఆంధ్రాలో తెలంగాణ ఉద్యోగులు నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారు.. వారిని వెనక్కి తెచ్చేందుకు తెలంగాణ సర్కారు లేఖలు రాసిని ప్రయోజనం ఉండటం లేదు’’ అంటూ మండిపడ్డారు. నిజంగానే చంద్రబాబుకు అంత పవర్ ఉంటే ఆయన పాలిస్తున్న రాష్ట్రానికి ఏం కావాలో ఎప్పుడో చేయించుకునే వాళ్లు కదా.. ఈ విషయం కోదండరాం ఆలోచించలేదేమో..