ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం...రేపు విద్యా సంస్థలకు సెలవు
posted on Aug 27, 2025 @ 8:31PM
తెలంగాణలో రికార్డు స్ధాయి అత్యధిక వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో అత్యధికంగా 50 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్ధాయి వర్షపాతం మొదలైంది. కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో పశువుల పాకలు సైతం నీట మునిగాయి. పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు వరదల్లో చిక్కుకుపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలంలో ఉన్న ధూప్‌సింగ్ తండాను వరద నీరు ముంచెత్తింది. వరద నీరు ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రజలు ఇండ్లు పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. తమను కాపాడాలంటూ ప్రజలు ఆర్తనాదాలు పెట్టారు. మెదక్ జిల్లాలో రెప్పల ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఒకవైపు పోలీసులు ఫైట్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్కే చేసి బోట్లు ద్వారా ప్రజలను రక్షిస్తూ ఉండగా... మరోవైపు ఇండ్ల పైకి ఎక్కిన ప్రజలు హెలికాప్టర్ సహాయం కోసం ఎదురుచూశారు.
సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచున కొట్టుమిట్టాడుతోంది. వరద ఉధృతి భారీగా పెరగడంతో అలుగు పది అడుగుల తీవ్రతతో కిందికి దుంకుతున్నది. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోగా ప్రవాహం మట్టి కట్టను ఢీకొని పొంగిపొర్లుతోంది.
తద్వారా భారీ బుంగ ఏర్పడే ప్రమాదం నెలకొంది. అదే జరిగితే పోచారం ప్రాజెక్టు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి.భారీ వర్షాలు నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో రేపుగురువారం)విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు.