శేషాచల అడవుల్లో పెద్దపులి సంచారం
posted on Aug 27, 2025 @ 8:05PM
ఎప్పుడూ కనిపించని ఉమ్మడి కడప జిల్లాలోని చిట్వేలి ప్రాంతంలో గల శేషాచల అడవుల్లో పెద్ద పులి కనిపించింది .తిరుమల అడవులతో కలిసి ఉన్న శేషాచలం అడవుల్లో పెద్దపులి సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు అమర్చిన కెమెరాల్లో పులుల సంచార దృశ్యాలు కనిపించినట్లు సమాచారం.
చిట్వేలు రేంజ్ అధికారులు ఆ రేంజ్ పరిధిలో 30 ట్రాప్ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా పెద్దపులి రాత్రి సమయంలోనే కాకుండా పగటి కూడా తిరుగుతున్నట్టు కనిపించట్లు గుర్తించారు .రెండు నుంచి మూడు పులులు ఈ అడవుల్లో తిరుగుతున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు.
ఈ పెద్ద పులులు కర్నూలు జిల్లా గుండ్లబ్రహ్మేశ్వరం శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు నుంచి నల్లమల శేషాచలం కారిడార్ ద్వారా చిత్తూరు ప్రాంతానికి చేరుకుని ఉంటాయని భావిస్తున్నారు.గతంలో లంకమల పరిసర ప్రాంతాల్లో పులి కనిపించిన ప్రచారం జరిగింది .
నల్లమల ,లంకమల,శేషాచలం అడవులను కలుపుతూ టైగర్ జోన్ ను కూడా గతంలో ఏర్పాటు చేశారు . ఈ పరిస్థితుల్లో నలమలశేశాచలం అటవీ కారిడార్ లో పులి ప్రత్యక్షం కావడం చూస్తే ఇక నలమల, లంకమల శేషాచలం అడవుల్లో కూడా పులుల సంచారం పెరిగే అవకాశాలు ఉన్నాయి.