ఈద్ ముబారక్
posted on Oct 27, 2012 @ 11:36AM
ఈ రోజు ముస్లిం సోదరులంతా ఎంతో భక్తి యుక్తంగా జరుపుకునే బక్రీద్ పండుగ. చాంద్రమానం ప్రకారం చివరి నెలలో 10 వ రోజు జరుపుకునే దుల్ హాగ్ రోజునే బక్రీద్ గా జరుపుకుంటారు. ముస్లింలకు మూల పురుషుడైన ఇబ్రహీం ను దేవదేవుడైన అల్లాహ్ లేక లేక పుట్టిన అతని కుమారుడైన ఇస్సాక్ (13) ను బలి ఇమ్మని చెబుతారు. అందుకు తగ్గ సరంజామా చేపట్టి కొండమీదకు వెళ్లి కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్దపడుతుండగా దేవుడు మెచ్చి నీ కుమారుడిని ప్రేమిస్తున్నావా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని తెలుసు కుంటానికే ఈ పరీక్ష పెట్టానని చెప్పి నీవే నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను నేను సంతోషిస్తున్నానంటూ ప్రక్కనే ఉన్న గొర్రెపొటేలును బలి ఇవ్వండని తెలుపుతారు. దేవుడు తమకు చేసిన ఈ సంతోషకరమైన దినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ ఈ పండుగను ఆచరిస్తారు. ముస్లింలందరూ కొత్త బట్టలు ధరించి మసీద్ కి వెళ్లి శాంతి సౌభ్రాతుత్వాలు వెల్లివిరియాలని ప్రార్దనలు జరుపుతారు. అల్లాహ్ నిర్ణయించిన నిబంధనల మేరకు ఉన్న గొర్రెను, లేదా మేకపోతు లేదా కోడెదూడను బలి ఇస్తారు. అందుకు గానూ వయస్సు, రూపు రేఖలు నిర్ణయించ బడినవై యుండాలి. కోసిన మాంసాన్ని సగం ఇంటిలో వండుకుంటారు. మరికొంత బందువులకు, మిత్రులకు ఇవ్వడానికి మరికొంత పేదలకు ఇవ్వవలసి ఉంటుంది. ఇది సహజీవనాన్ని ఉద్భోధించే పండుగ. మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులకు బక్రీద్ ముబారక్.