సొంత పార్టీపైనే మండిపడ్డ కడియం
posted on Apr 20, 2013 8:00AM
శుక్రవారం తెలంగాణా టిడిపి ఫోరం ఎన్టీఆర్ భవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో కడియం శ్రీహరి వాడి వేడిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వడం చాలా పెద్ద పరిణామం అని, అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పామని, ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళలేకపోయామని, ఈ పరిణామం వల్ల తెలంగాణాలో పార్టీకి రావాల్సినంత ఫలితం కనబడడం లేదని, లోపం ఎక్కడుందో మనం ఆత్మ విమర్శ చేసుకొని పొరపాట్లు సరిదిద్దుకోవాలని, తెలంగాణలో మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ ఇంతవరకూ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసుకోలేదని, 30-35 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంకా ఇన్ ఛార్జీలను కూడా ఎంపిక చేయలేదని, జిల్లాలో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇంకా తగ్గలేదని, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటం చేయాల్సినంత చేయలేకపోతోందని, ఈ సమస్యలను పరిష్కరించకుండా అధికారంలోకి రావాలంటే రాలేము అని తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.