మ్యూజిక్ సర్వీస్ ప్రారంభించిన ట్విట్టర్
posted on Apr 20, 2013 8:22AM
వీడియోలు, ఫోటోలు, రాతలకే పరిమితమైన ట్విట్టర్ తాజాగా మ్యూజిక్ సర్వీసును ప్రారంభించింది. ఈ సోషల్ నెట్ వర్క్ లో ఏయే పాటలు, ఆర్టిస్టులు ఎక్కువ ప్రచారంలో ఉన్నారో తెలుసుకోడానికి కూడా వీలుంటుంది. హాష్ టాగ్ తో ఉండే ఈ మ్యూజిక్ సర్వీసును ట్విట్టర్ వాడుతున్న వారు ఎంజాయ్ చేయవచ్చు. ట్విట్టర్ మ్యూజిక్ ను తెరవడానికి రెండు రకాలున్నాయి. మొదటిది కంప్యూటర్ లో అయితే మ్యూజిక్ ట్విట్టర్.కామ్ సైట్ ను ఓపెన్ చేసి ఆనందించవచ్చు. రెండో రకం ఐపోడ్ లో ఉచితంగా లభించే యాపి ను డౌన్ లోడ్ చేసుకుని ఆనందించావచ్చు. కానీ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రం ఫోన్ లో ట్విట్టర్ మ్యూజిక్ వినే అవకాశం లేదు. ట్విట్టర్ ఖాతాను తెరిచి చూస్తే సరికొత్త పాటలు, ఆర్టిస్టుల పేర్లు అన్నీ ఒకే చోట కాకుండా, వేర్వేరు లింకులలో ఉంచారు. పాపులర్, ఎమర్జింగ్, సజెస్టేడ్, నౌ ప్లేయింగ్, మీ అనే విభాగాలు కనిపిస్తాయి. ప్రతి క్యాటగిరీలో కొన్ని పాటలను సూచిస్తారు. నౌ ప్లేయింగ్ విభాగంలో అయితే అదే సమయంలో మిగిలిన వాళ్ళు ఏయే పాటలు వింటున్నారో, వాళ్ళ ట్విట్టర్ లో ఏ పాటలు ప్రస్తావిస్తున్నారో కనిపిస్తూ వుంటుంది. మీరు ఏ పాట వింటున్నా ముందుగా ఐట్యూన్స్ అందించే చిన్న ప్రివ్యూలో కనపడతాయి. మీరు స్పాట్ ఫై ప్రీమియం సభ్యులో లేక ఆర్.డి.యో. పెయిడ్ యూజర్ గానీ అయితే నేరుగా మీ ఖాతాకు కనెక్ట్ అయ్యి పూర్తి పాటను వినవచ్చు. అలా కాకుండా మామూలుగా పాట వినాలంటే టైల్ మీద క్లిక్ లేదా టాప్ చేయాలి. ఎడమచేతి వైపు కింద భాగంలో ప్లే కంట్రోళ్ళు ఉంటాయి. అక్కడ ఏదైనా ట్రాక్ ను కాసేపు పాజ్ చేయవచ్చు, లేదా పూర్తిగా స్కిప్ చేయవచ్చు. పాటలు వింటూనే ట్విట్ ను కంపోజ్ కూడా చేయవచ్చు.