రాహుల్ దూత గతం ఏమిటి ?
posted on Dec 3, 2012 @ 3:26PM
కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ దూతగా రాష్ట్రానికి వచ్చిన జితేంద్ర దేస్ ప్రభు గతం అంతా నేరమయమే. గోవాకు చెందిన ప్రభు గతంలో శరద్ పవార్ పార్టీ ఎన్సిపి తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. గోవాలో బయట పడిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రభు పాత్ర ఉందని గోవా పోలీసులు నిర్ధారించి ఆయనను అరెస్టు కూడా చేశారు. ఆయనకు 1.72 కోట్ల జరిమానా పడింది.
కార్గోవా గ్రామంలో రెండు లక్షల టన్నుల మేర ఐరన్ ఒర్ అక్రమ మైనింగ్ కు ప్రభు పాల్పడ్డారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పోలీసులు ప్రభు ఫై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రభు ఇటీవలే కాంగ్రెస్ లో చేరి అధికార ప్రతినిధి గా బాధ్యతలు చేపట్టారు. అయనను పార్టీలో చేర్చుకోవడంఫై బిజెపి కాంగ్రెస్ పార్టీ ని తీవ్రంగా విమర్శించింది కూడా.
అలాంటి వ్యక్తికి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల విజయావకాశాల ఫై సర్వే చేసే పనిని పార్టీ అప్పగించింది. ఇలాంటి వ్యక్తి ప్రస్తుతం వివిధ స్థానాలకు పార్టీ అభ్యర్దులను ఎంపిక చేసే కసరత్తులో పాలు పంచుకుంటున్నాడు. ఇలాంటి నాయకుల వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోందని పార్టీకి చెందిన నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.