జగన్ రిమాండ్ పొడిగింపు
posted on Jul 29, 2013 @ 5:11PM
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసు నిందితుల రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 12 వరకు పొడిగించింది. జగన్ తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జగన్, విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును పొడిగించారు.
జగన్ ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసుల్లో కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోనేరు రాజేంద్ర ప్రసాద్, నిత్యానంద రెడ్డిలు హాజరయ్యారు.