జగన్ ఆస్తులు.. లేటెస్టు జప్తులు...
posted on Feb 27, 2015 @ 11:49AM
జగన్ ఆస్తులు జప్తు కావడం అనేది మామూలు విషయం అయిపోయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నెలకో రెండు నెలలకో ఓసారి జగన్‌కి చెందిన వందల కోట్ల ఆస్తులను జప్తు చేయడం మామూలైపోయింది. పుట్ట తవ్వేకొద్దీ పాములు బయటపడుతున్నట్టు కేసులను తవ్వేకొద్దీ జగన్ ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా 232.28 కోట్ల జగన్ ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. జగన్‌కి చెందిన భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, జగతీ పబ్లికేషన్స్‌కు చెందిన ఆస్తులివి. ఇ.డి. జప్తు చేసిన తాజా ఆస్తుల వివరాలు ఇలా వున్నాయి...
* కడప జిల్లాలో జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 90 లక్షల విలువైన 2.11 ఎకరాల భూమి.
* విశాఖపట్టణం జిల్లాలోని జననీ ఇన్‌ఫ్రాకు చెందిన కోటి 32 లక్షల విలువైన 1.97 ఎకరాల భూమి.
* బెంగళూరులోని 73 లక్షల విలువైన 2 ఎకరాల 3 గుంటల భూమి.
* హైదరాబాద్‌లోని పంజగుట్టలో 2.12 కోట్ల విలువైన 886 చదరపు గజాల ప్లాట్.
* అనంతపురం జిల్లాలో 1.23 కోట్ల విలువైన 245.86 ఎకరాల భూమి.
* హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విజయా బ్యాంకులో భారతీ సిమెంట్ కార్పొరేషన్‌కి చెందిన 95.33 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు.
* ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ దగ్గర ఉన్న త్రినేత్ర సిమెంట్స్ లిమిటెడ్‌కు చెందిన 86.67 కోట్ల విలువైన 86,67,097 షేర్లు.
* ఇండియా సిమెంట్స్ దగ్గరున్న 20.32 కోట్ల విలువైన 20,32,260 కోరమాండల్ షుగర్స్ లిమిటెడ్ డిబెంచర్లు.
* జగతి పబ్లికేషన్స్ ఖాతాలో ఉన్న 10.20 కోట్ల విలువైన 1,02,00,000 ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లు.
* ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ దగ్గరున్న 10 కోట్ల విలువైన త్రినేత్ర సిమెంట్స్ లిమిటెడ్ 10,00,000 షేర్లు.
* కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉన్న 25 లక్షల రూపాయల విలువైన 2,50,000 ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లు,
* 3.2 కోట్ల రూపాయల విలువైన సరస్వతి పవర్, రక్షణ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు.