జగన్ కు మరో 6 నెలల వరకు నో బెయిల్
posted on Oct 6, 2012 @ 12:44PM
బెయిల్ కోసం జగన్ చేసుకున్న పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ జరిగిన వాదనల్లో కోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతే గాక 2013 మార్చి 31 తో వాదనలు పూర్తి చేయాలని పేర్కొంటూ, ఆ సమయంలో బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జగన్ కు సూచించింది. దీంతో మరో ఆరు నెలల వరకూ జగన్ కు బెయిల్ వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. అయితే పరిస్థితులు మారితే మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకునేందకు జగన్ న్యాయవాదులు అనుమతి కోరారు. జగన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీ వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు.