జగన్ కు సిబిఐ మరో షాక్
posted on Oct 6, 2012 @ 11:39AM
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ మరో షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా జగన్ కేసు విషయంలో మౌనంగా ఉన్న సీబీఐ దూకుడు పెంచింది. జగన్ కంపెనీలు, నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. గత రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. కేసు విచారణలో భాగంగా కోర్టు అనుమతి తీసుకుని సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. సీబీఐ ఎస్పీ వెంకటేష్ నేతృత్వంలో నాలుగు బృందాలుగా తనిఖీలు జరుపుతున్నారు. తనిఖీల్లో భారతీ సిమెంట్స్, జననీ ఇన్‌ఫ్రా లో బినామీలను గుర్తించారు. సీబీఐ మరిన్ని దాడులు చేయనుంది.