ప్రధాని రాజీనామాకు డిమాండ్, సభ వాయిదా
posted on Aug 28, 2012 @ 5:47PM
మంగళవారం కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బొగ్గు కుంభకోణంపై దుమారం చెలరేగింది. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ రాజీనామా చేయాలని బీజేపీ పట్టినపట్టు వీడలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటు రెండు సార్లు వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. బొగ్గుపై చర్చ చేపట్టాలని, ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుపట్టడంతో సభాపతి లోక్‌సభను గురువారం నాటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కూడా ఇతే పరిస్థితి కొనసాగడంతో ఛైర్మన్ అన్సారీ సభను ఎల్లుండికి వాయిదా వేశారు.