రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి
posted on Aug 29, 2012 9:03AM
వచ్చేఎన్నికల్లో జగన్ కి ప్రజలు పట్టం కడతారు. ఎన్డీటీవీ తాజా సర్వేలో తేలిన నిజమిది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను దూరం చేసుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని జనం గట్టిగా నమ్ముతున్నారని ఎన్డీటీవీ అంటోంది. జనంలోకూడా ఈ అభిప్రాయం బలంగా స్థిరపడిపోయినట్టే కనిపిస్తోంది.
ప్రతిపక్షాలుమాత్రం ఎన్డీటీవీ సర్వేపై దుమ్మెత్తి పోస్తున్నాయి. జగన్ మీడియాకు కన్సల్టెంట్ గా పనిచేస్తున్న ఎన్డీటీవీ ఇప్పటికిప్పుడు ఏ సందర్భం లేకుండా ఇలాంటి సర్వేలు ఎందుకు చేయాల్సొచ్చిందో చెప్పాలంటూ టిడిపి నేతలు మండిపడుతున్నారు. కేవలం కన్సల్టెంట్ గా ఉన్న ఎన్డీటీవీ జగన్ ని భుజాలకెత్తుకోవడానికి మాత్రమే ఈ కాకి లెక్కలు చూపిస్తోందని చంద్రబాబు మండిపడుతున్నారు.
త్వరలో సాక్షితో ఎన్డీటీవీ టైఅప్ ముగియబోతోంది. పనిలోపనిగా ఓ సర్వేచేసిచ్చేస్తే పోలా అనుకున్న ప్రణయ్ రాయ్.. జగన్ కి ఫేవర్ గా సర్వే ఫలితాలుండేలా జాగ్రత్త తీసుకున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. పబ్లిక్ ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ వేసిన ఎత్తుగడే ఎన్డీటీవీ సర్వే అని టిడిపి గట్టిగా అభిప్రాయపడుతోంది.