2019 ఇస్రో రిపోర్ట్... ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న భారత్...
posted on Dec 31, 2019 @ 2:59PM
శాస్త్రసాంకేతిక రంగాల్లో కూడా 2019 ఒక మైలురాయిగా నిలిచింది. చంద్రయాన్ 2 మొదలుకొని క్షిపణి సంబంధిత పరీక్షల దాకా ఎన్నో ముఖ్య సంఘటనలు ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్నాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ పాక్షికంగా విజయం సాధించింది. రోవర్ చంద్రునిపై సరిగా ల్యాండ్ కాలేకపోయింది. కానీ, అతి తక్కువ ఖర్చుతో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రపంచ దృష్టికి ఆకర్షించింది. అలాగే, అగ్రరాజ్యాల తనవైపు తిప్పుకుని ఆలోచించజేసింది.
ఇక తాజాగా చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ పనులను కూడా ఇస్రో ప్రారంభించింది. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కు వీరు ముత్తవేల్ సారథ్యం వహించనున్నారు. ఉపరితలం నుండి అంతరిక్షానికి సత్వరమే ప్రయోగించగల రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. తాజాగా బ్రహ్మోస్ ను కూడా విజయవంతంగా పరీక్షించింది. ఇక, పీఎస్-ఎల్వీ సిరీస్ లో మూడు రాకెట్లను... జీఎస్-ఎల్వీ సిరీస్ లో మరో రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.