ఒవైసీపై దాడి.. పేకే ప్లానేనా?
posted on Feb 5, 2022 @ 3:33PM
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని,ఢిల్లీ తిరిగి వస్తున్న సమయంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్’ ఒవైసీ ఫై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అల్లా దయవలన అయన సురక్షితంగా బయట పడ్డారు. ఆయన కాన్వాయ్’ ఒక కారుకు రెండు బుల్లెట్’ తూట్లు పడ్డాయి. ఒక టైరు పగిలింది. అంతకు మించి, ఇంకేమీ కాలేదు.
అయినా కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఆయనకు జెడ్’ కేటగిరీ భద్రత కలిపించింది. ఒవైసీ, వద్దన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు చెప్పారు. దేశం కోసం ప్రాణం ఇచ్చేందుకైనా సిద్దమని పార్లమెంట్ సాక్షిగా గంభీర ప్రకటన కూడా చేశారు.
అంతకు ఒకే ఒక్క రోజు ముందు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మీడియా సమావేశంలో ఒవైసీని మెచ్చుకున్నారు. ఒవైసీ దేశంలో ‘చమక్’ తున్నారని, ఓ వెలుగు వెలుగుతున్నారని సంతోషం వ్యక్త పరిచారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడాన్ని స్వాగతించారు. మరో వంక ఈ దాడి విషయంగా రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఎవరూ కూడా, ఒవైసీపై జరిగిన దాడిని, హత్యాయత్నంగా భావించడం లేదు. స్పీడుగా వెళుతున్న వ్యక్తిపై హత్యాయత్నం ఎవరూ చేయరు. అందుకే కావచ్చును, ఇదొక డ్రామాగానూ అనుమానిస్తున్నారు. ఇంకొందరు ఇంకొక అడుగు ముదుకేసి... పీకే (ప్రశాంత్ కిశోర్) డైరెక్షన్’లో బీజేపీ గేమ్ ప్లాన్’గా పేర్కొంటున్నారు. ఇందులో కేసీఆర్’ది కీలక పాత్రని అంటున్నారు.
యూపీలో ఆ మాటకొస్తే, దేశం మొత్తంలో ఎంఐఎం, బీజేపీకి ‘బీ’ టీమ్’గా, రహస్య మిత్ర పక్షంగా వ్యవహరిస్తోంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ముస్లిం ఓటు బ్యాంక్’కు గండి కొట్టి, పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకే ఒవైసీ యూపీలో వంద స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులను పోటీకి నిలిపారు. కాగా, యూపీలో ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్’లో ఫిబ్రవరి 10న పోలింగ్ జరిగే పశ్చిమ యూపీలో 22 శాతం వరకు ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్, ఈసారి గంప గుత్తగా, ఎస్పీ ఖాతాలో చేరే ప్రమాదం ఉదని పసిగట్టిన కమలదళం మరో రహస్య మిత్రుడు కేసీఆర్ ద్వారా ఇంకో రహస్య ప్రేమికుడు పీకే’ ప్లాన్ ఇంప్లెమెంట్ చేసిందని. అందుకే డ్రామాను రక్తి కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం జెడ్. కేటగిరి రక్షణ ఆఫర్ చేసిందని అంటున్నారు.
అదలా ఉంటే ప్రశాంత్ కిశోర్ స్టాండర్డ్ ‘స్క్రిప్ట్’లో తమ క్లైంట్ మీద ఇలాంటి ‘దాడి’ జరగడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. అందుకు ఆధారాలు కూడా చూపుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రివాల్, పీకే క్లైంట్’గా ఉన్నరోజుల్లో ఒక ఆగంతకుడు ఆయన చెంప పగులగొట్టారు. ఇలా ఒక ఆగంతుకు చెంపపగలగొట్టడం ఇంకొకరు ఆయన ముఖంపై సిరా చల్లడం...ద్వారా కేజ్రివాల్’ను పీకే హీరోని చేశారు. ఇదీ పీకే ఆడిన డ్రామా అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయినా కేజ్రివాల్ గెలిచారు.
ఆలాగే, 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి , పీకే క్లైంట్ YS జగన్మోహన్ రెడ్డిపై "కోడికత్తి" దాడి జరిగింది. ఆయానా గెలిచారు. అదే విధంగా 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో వున్నప్పుడు బీజేపీ గుండాలు జరిపిన దాడిలో ఆమె కాలు విరిగింది. ఆ ఎన్నికల్లో అది టర్నింగ్ పాయింట్’ గా మారింది. ఎన్నికల ప్రచారం అంతా మమతా దీదీ కాలుకు కట్టు కట్టుకుని, వీల్ చైర్’లో ప్రచారం చేశారు. హాట్రిక్ కొట్టారు. ఫలితాలు రాగానే, మంత్రం వేసినట్లు కట్టు ఊడిపోయింది ..కాలు మాములుగా చిందులేసింది.
అయితే, ఈ రహస్య బంధాలకు, బంధుత్వాలకు ఆధారాలు ఉన్నాయా అంటే, అలాటివి ఏవీ ఉన్నట్లు కనిపించదం లేదు. కానీ, హైదరాబాద్, ఢిల్లీ, యూపీ డాట్స్’ను కలిపీతే.. ఒవైసీ మీద జరిగినట్లు చెపుతున్న హత్యాయత్నం, ఓ మాంచి పొలిటికల్ థ్రిల్లర్’ గా పొలిటికల్ సర్కిల్ల్స్’లో ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో, పీకే ‘వ్యూహాలు’ అన్ని సందర్భాలలో సక్సెస్ కావనే మాట కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి పీకే ప్లాన్ ప్రకారమే, రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బట్, ఆశించిన విధంగా కేసేఆర్ జాతీయ స్థాయిలో హీరో కాలేదు, రాష్ట్రంలో అభాసు పాలయ్యారు, దళితద్రోహిగా, దళిత వ్యతిరేకగా దళిత బంధనం చిక్కుల్లో చిక్కుకున్నారు. నిజానికి, పీకే వ్యూహాలకు కాల చెల్లిందని అంటున్నారు.