ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఇచ్చిన షాక్...
posted on Oct 28, 2019 @ 6:55PM
ప్రధాని నరేంద్ర మోదీ విమానానికి పాక్ గగనతలం నుంచి ప్రయాణించటానికి పాక్ అనుమతి ఇవ్వలేదు, దీనిపై భారత్ మండిపడింది. మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను పాక్ తోసిపుచ్చడంతో దాయాది దేశానికి బుద్ధి చెప్పాలని భారత్ యోచిస్తోంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐ సీ ఏ వో దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లే యోచనలో ఉంది. ఒక దేశానికి సంబంధించి మరో దేశ గగనతలంపై ప్రయాణ అనుమతి అంశాలను ఐ సి ఏ వో చూసుకుంటోంది.
ఇప్పటికే రెండు సార్లు పాక్ గగనతలంపై ప్రయాణించటానికి తిరస్కరించటం పై భారత్ పాక్ మీద ఆగ్రహంగా ఉంది. దాంతో ఈ సారి పాక్ కు గుణపాఠం నేర్పాలని భావిస్తున్న భారత్ ఐ సీ ఏ వో తలుపు తడుతోంది. గత నెలలో అమెరికా పర్యటన సందర్భం లోనూ పాక్ తమ గగనతలం నుంచి ప్రధాన మోదీ విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించింది. అంతకుముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఐస్ ల్యాండ్ పర్యటన సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది.
బాలాకోట్ దాడుల తరువాత కొద్దికాలం గగనతల మార్గాలను మూసివేసిన పాక్ అనంతరం కొన్నాళ్ల తరవాత తెరిచింది. ఇటీవల కాష్మీర్ విషయంలో ఆర్టికల్ 370 ను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో పాక్ మళ్లీ భారత విమానాలకు గగనతలాన్ని మూసివేస్తోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న భారత్ పాక్ కు ఎలాగైనా బుధ్ధి చెప్పాలని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ అయిన ఐ సీ ఏ వో దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని భారత్ భావిస్తుంది.