గెలిచినా భారత్ ఇంటికే
posted on Oct 3, 2012 @ 9:50AM
భారీ గెలుపు తప్పనిసరైన మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి ఆరు వికెట్లకు 152 పరుగులు సాధించింది. సురేష్ రైనా 34 బంతుల్లో 5 పోర్లతో 45, రోహిత్ శర్మ 25, ధోనీ 13 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్, యువరాజ్ సింగ్ 21 రాణించారు. మోర్నీ మోర్కెల్, రాబిన్ పీటర్సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో డివిల్లీర్స్ సేన 19.5 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. డుప్లెసిస్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 ఒంటరి పోరాటం ఫలితాన్నివ్వలేదు కానీ, భారత్ సెమీస్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. భారత బౌలర్లలో జహీర్ 3/22, బాలాజీ 3/37, యువరాజ్ 2/23 మెరుగైన ప్రదర్శన చేశారు. ఆల్‌రౌండ్ షోతో రాణించిన యువీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.