ప్రపంచ U19 క్రికెట్ కప్ సెమీస్ లొ భారత్ స్కోరు 209
posted on Aug 23, 2012 8:45AM
ప్రపంచ బాలుర 19 సంవత్సరాలలోపు ప్రపంచ క్రికెట్ కప్ సెమీ ఫైనల్ పోటీలో న్యూజిలాండ్ తో భారత్ తలపడుతుంది. భారత్ తొలత బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కు 210 పరుగుల విజయలక్ష్యం విధించింది. మొట్టమొదటి మ్యాచ్ లొ వెస్ట్ ఇండీస్ చేతిలో పరాజయం పాలైన భారత్ అటు తరువాత అన్ని మ్యాచ్ లను నెగ్గింది. క్వార్టర్ ఫైనల్స్ లొ దాయాది, చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లొ ఉత్కంఠభరిత పోరులో ఒక్క వికెట్ తేడాతో నెగ్గి సెమీస్ చేరింది,