వరద గోదావరితో లంక గ్రామాలకు ముప్పు
posted on Aug 23, 2012 8:31AM
మొన్నటిదాకా ఇసుక దిబ్బలతో కనిపించిన గోదావరి ఇప్పుడు ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. బుధవారం ఉదయం కాటన్ బ్యారేజీ వద్ద 10.7 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 12.30 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తివేసి 11, 21, 300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. అలాగే జిలా యంత్రాంగం అధికారులను, నదీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేసింది, దేవీపట్నం మండలంలోని కొండమొదలు ప్రాంతాలలోని 33 గ్రామాలకు ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. రాజమండ్రి సమీపంలోని లంక గ్రామాలోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కోనసీమ పరిథిలోని 24 లంక గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. జిల్లా యంత్రాంగం కలక్టరేట్, ఆర్డీఓ, తహసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లకు ప్రారంభించింది.