సర్పంచ్ ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రచారం

Publish Date:Dec 10, 2025

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకుంటున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.  మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ప్రచారం కోసం ఏకంగా  ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నే రంగంలోకి దింపాశారు. తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్తవంగా అల్లు అర్జున్ ఆ సర్పంచ్ అభ్యర్థికోసం చేయడంలేదు. అలా చేస్తున్నట్లుగా సదరు సర్పంచ్ అభ్యర్థి ఏఐ టెక్నాలజీతో ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియోను తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా?

Publish Date:Dec 9, 2025

కేంద్ర మంత్రత్వ శాఖలన్నిటిలోనూ అత్యంత రిస్కీ శాఖ అంటూ ఏదైనా ఉందంటే అది పౌర విమానయాన శాఖ మాత్రమే. ఇటీవలి కాలంలో ఈ శాఖను కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ తెలుగువారికే అప్పగిస్తోంది. అది కూడా భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం కే ఈ శాఖ కేటాయిస్తోంది. గతంలో అంటే 2014-19లో ఎన్డీయే కూటమి తన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఎంపీ అయిన అశోక గజపతి రాజుకు ఈ శాఖ కట్టబెట్టింది. ఇప్పుడు 2024లో మళ్లీ ఈ శాఖను తెలుగుదేశం యువ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడికి అప్పగించింది. వాస్తవానికి పౌర విమానయాన శాఖ అత్యంత క్లిష్టమైనది, అత్యంత కీలకమైనదీ కూడా.  ప్ర‌మాదాలు, వివాదాలు సాంకేతిక లోపాలు వంటివి విమనాయానాల్లో సహజం.  దేశంలో ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా, సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సర్వీసు రద్దైనా పౌర విమానయాన శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.     ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.  విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. శాఖాపరమైన పనులు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా జరిగేలా చూస్తున్నారు. అందరూ ఆయన పని తీరును భేష్ అంటూ ప్రశంసిస్తున్నారు.  అదలా ఉంటే.. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమానాలలో సాంకేతిక లోపాల వంటి కారణాలు పౌరవిమానయాన శాఖకు తలనొప్పిగా పరిణమించాయి.  తాజాగా ఇండిగో వ్య‌వ‌హారం మరొ పెద్ద సమస్యగా పరిణమించింది. డీజీసీఏ నిబంధ‌న‌లు పైలట్లకు విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తే.. అవి కాస్తా ఆ శాఖా మంత్రి అయిన రామ్మోహ‌న్ నాయుడుకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెండ్ చయడం కోసం జాతీయ మీడియా పౌర విమానయాన సంస్థ మంత్రిని స్కేప్ గోట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నది.  జాతీయ మీడియా ఉద్దేశ పూర్వకంగా దక్షిణాది మంత్రులపై దాడి చేస్తున్నదా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. ఇండిగో సంస్థ ప్రణాళికా లోపం, నిర్వహణ వైఫల్యం కారణంగా ఆ సంస్థకు చెందిన విమాన సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దై ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ఇందుకు బాధ్యత వహించాల్సింది పూర్తిగా ఇండిగో సంస్థ. ఇప్పటికే ఆ సంస్థపై చర్యలకు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉపక్రమించారు. సుప్రీం కోర్టు కూడా కేంద్రం తీసుకుంటున్న చర్యలను సమర్థించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయినా జాతీయ మీడియా మాత్రం ఇండిగో సంక్షోభాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి వైఫల్యంగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తున్నది.  ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ మీడియావాటికి ఆ శాఖ మంత్రిని బాధ్యుడిని చేస్తూ కథనాలు వండి వార్చలేదు. ఇప్పుడు ఇండిగో వ్యవహారంలో మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించాలంటూ గగ్గోలు పెడుతోంది. అంటే జాతీయ మీడియా ఉత్తరాది, దక్షిణాది వివక్ష చూపుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు..!!

Publish Date:Dec 10, 2025

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు. మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు: లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.   
[

Health

]

నెల రోజుల పాటు టీ మానేసి చూడండి.. షాకవుతారు..!

Publish Date:Dec 10, 2025

భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి,  అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా,  ఫుడ్ లేటయినా కనీసం టీ  అయినా తాగాలి.  ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు.  మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి,  ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి  హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్,  ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి  రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే  నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి,  అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్,  టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట,  అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ.. టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో  ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల  నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా,   నాణ్యమైన నిద్రను పొందడంలో  సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం,  ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి  దంతాల  రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా  దంతాలు శుభ్రంగా,  ప్రకాశవంతంగా కనిపిస్తాయి.  శరీరం హైడ్రేషన్ గా ఉండటం,  వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల  పొడిబారడం తగ్గుతుంది.  చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...