కార్ల బ్లాక్ ఫిల్మ్ తొలంగింపుతో సెలబ్రిటీల గోల
posted on Oct 27, 2012 @ 11:39AM
కార్ల బ్లాక్ ఫిల్మ్ లను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు 15 రోజులు సమయమిచ్చి ఫిల్మ్ లను తొలగించవలసిందిగా ప్రజలను మీడియా , పాంప్లెట్ల వాల్ పోస్టర్ల ద్వారా కోరారు. రేపటితో గడువు ముగియనుంది, సోమవారం నుండి ఎవరైన బ్లాక్ ఫిల్మ్ లను తొంలగించ కుండా ఉన్నట్లయితే వారికి 500 రూపాయల ఫైన్ పడుతుందని పోలీసులు చెబుతున్నారు. దాంతో వాహన యజమానులు ఎవరికి వారే బ్లాక్ ఫిల్మ్ లను తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనివల్ల తమకు చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని సెలబ్రిటీలయిన సినిమాయాక్టర్లు, మోడల్స్, పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. అభిమానుల తాకిడితో తమకు అవాంతరాలు వస్తాయని వారు చెబుతున్నారు. అలాగే హిట్ లిస్టులో ఉన్న అధికారులు, మంత్రులు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్యులననుసరించి దీన్ని కుదించడం కుదరదని ఇది తప్పక పాటించవలసిందేనని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.