మళ్ళీ అధికారుల బదిలీ మేళా
posted on Jul 1, 2013 @ 7:15PM
ప్రభుత్వ పాలన ప్రధానంగా ఐఏయస్, ఐపీయస్ మరియు ఇతర ప్రభుత్వాధికారుల ద్వారానే సాగుతున్నపటికీ, రాజకీయనాయకుల చేతిలో వారు ఆట బొమ్మలుగా మిగిలిపోతున్నారు. నేతల అవినీతి మేతకు, ఆగడాలకు అడ్డుపడితే ఇక ఆ అధికారికి శంకరగిరి మాన్యాలే గతి. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడమనేది వారి రికార్డులోనే ఉండదు. తరచూ బదిలీలతో వారి వ్యక్తిగత, కుటుంబ జీవితాలు దెబ్బతింటున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహయత వారిది. ప్రభుత్వం నిన్న హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున బదిలీలు చేసి, తన ప్రతాపం మరో మారు చాటుకోంది.
రంగారెడ్డి జిల్లాలో యదేచ్చగా సాగుతున్న భూ కబ్జాలను అడ్డుకొంటున్నందుకు కలెక్టర్ వాణీ ప్రసాద్, జాయింట్ కలక్టర్లు ఆర్.ముత్యాల రాజు, యం.జగన్నాధం వేరే చోటికి బదిలీ చేయబడ్డారు. అదే కారణాలతో హైదరాబాద్ కలెక్టర్ గా చేస్తున్న యస్ఏయం రజ్వీని కూడా విద్యుత్ పంపిణీ సంస్థకి యండీగా నియమిస్తూ బదిలీ చేయగా, ఆయన స్థానంలోకి ఏపీ మినరల్ డెవెలప్మెంట్ బోర్డులో చేస్తున్న యం.కే.మీనా వచ్చారు.
ఇక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో చేస్తున్న పేరున్న పూనం మాలకొండయ్యకి గట్టిగా ఆరు నెలలు కూడా కాక మరో బదిలీ వేటు భరించక తప్పలేదు. ఐయేయస్ అధికారులలో ఆణిముత్యం వంటిదాని పేరున్నఆమె చేసిన పాపం అల్లా నియమ నిబందనలు ఖచ్చితంగా అమలుజేయడమే. నేతల ఆగ్రహానికి గురయిన ఆమెకు వేరొకచోటికి బదిలీ అయితే, ఆమె స్థానంలోకి కొత్తగా వైవీ.అనురాధ అనే కొత్త అధికారిణి వచ్చారు.
అధికారులు తమ సేవలకి ప్రతిఫలంగా ఈవిధమయిన బదిలీ వేటులు ఎదుర్కోవడం తప్పనిసరి అయిపోయింది. కానీ, తమ బంధువులు ఎవరో రాజకీయ పార్టీలు మారితే దానికి కూడా వీరినే శిక్షించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కార్మిక శాఖా కమీషనరు గా చేస్తున్న బీ. రామాంజనేయులుకి అప్రధాన్యమయిన ‘రెయిన్ షాడో ఏరియా డెవెలప్మెంట్’(అసలు ఇటువంటి శాఖా కూడా ఒకటుందని ఎంత మందికి తెలుసు?) బదిలీ చేయబడ్డారు. కారణం శాసన సభ్యుడయిన ఆయన అల్లుడు రాజేష్ అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవలే వైకాపాలోకి మారాడు! ఇప్పుడు ఆయన స్థానంలోకి డా.ఏ.అశోక్ అనే మరో అధికారి వచ్చారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ గా చేస్తున్న సిద్దార్థ్ జైన్ కూడా రాజకీయ నేతల ఆగ్రహానికి గురయి బదిలీకబడ్డవారే. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో వాణీ మోహన్ అనే మరో అధికారిణి స్థానంలోకి పంపబడ్డారు.
|
అధికారి పేరు |
ప్రస్తుత స్థానం |
బదిలీ అయిన స్థానం
|
|
దాసరి శ్రీనివాసులు |
ముఖ్యకార్యదర్శి- గనుల శాఖా |
వ్యవసాయ మరియు సహకార సంస్థకు |
|
బీ.శ్రీధర్ |
నెల్లూరు కలక్టర్ |
రంగారెడ్డి కలెక్టర్ |
|
జీ. కిషన్ |
బీసీ సంక్షేమం |
వరంగల్ కలెక్టర్ |
|
సందీప్ కుమార్ సుల్తానియా |
రిజిస్ట్రార్ సహకార సంస్థలు |
|
|
వీ.దుర్గాదాస్ |
ఏపీ ఆయిల్ ఫీల్డ్ వైస్ చైర్మన్ యండీ |
|
|
ఆర్.ముత్యాల రాజు |
|
జాయింట్ కలెక్టర్ తూ.గో.జిల్లా |
|
సి.హెచ్. ప్రభాకర్ |
|
జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి |
|
ఏ.మురళి |
|
ఎడిషనల్ సిఈఓయస్.ఈ.ఆర్.పీ. |
|
యమ్వీ రెడ్డి |
|
జాయింట్ కలెక్టర్ రంగా రెడ్డి |
|
కే.చంపాలాల్ |
|
జాయింట్ కలెక్టర్-2, రంగారెడ్డి |
|
టీ.ఆర్.కే రావ్ |
|
యండీ ఎపీయండీసీ |
|
బదిలీ అయిన ఐపీయస్ అధికారులు |
||
|
డా.యస్.ప్రవీణ్ కుమార్ |
ఇన్స్పెక్టర్ జనరల్ |
ఆ.ప్ర.సంక్షేమ శాఖ రెసిడేన్షియల్ ఎడ్యుకేషన్ విభాగం |
|
అతుల్ సింగ్ |
ఇన్స్పెక్టర్ జనరల్ |
డైరెక్టర్- స్టేట్ క్రిమేస్ రికార్డ్ బ్యూరో |
|
మహేష్ మురళీధర్ భగవత్ |
|
ఐజీ. సెక్యురిటీ |
|
కుమారి స్వాతి లక్రా |
|
ఐజీ.ఎపీయస్పీ బెటాలియన్ |
|
కే.ఆర్.యం. కిషోర్ కుమార్ |
|
అదనపు డైరెక్టర్, ఏపీ పోలీస్ అకాడమీ |
|
హరీష్ కుమార్ గుప్త |
|
ఐజీ. లా అండ్ ఆర్డర్ |
|
వీవీ శ్రీనివాస రావు |
|
ఐజీ. సిఐడీ సోషల్ జస్టిస్ |