హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకలు
posted on Sep 29, 2012 @ 12:09PM
హైదరాబాద్ జంటనగరాలలో గణేష్ మహారాజులు నిమజ్జనానికి కదిలాయి. పదకొండు రోజులు పాటు వేశేష పూజలందుకున్న గణనాథుడు శోభాయాత్ర పాతబస్తీ నుంచి ప్రారంభమైంది. బ్యాండుబాజాలు, భక్తుల కేరింతలు నృత్యాల మధ్య ఊరేగింపులు జరుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ కేంద్ర బిందువు అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని 22 చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. కాప్రా చెరువు, సరూర్‌నగర్ ట్యాంక్, రాజన్నబౌలి, మీరాలం ట్యాంక్, పల్లెచెరువు, ఎర్రగుంట, దుర్గం చెరువు, పాపిరెడ్డి చెరువు, నల్లచెరువు, గంగారం చెరువు, హఫీజ్‌పేట చెరువు, పటాన్‌చెరువు, ఐడియల్ ట్యాంక్, సున్నం చెరువు, హన్మత్‌పేట చెరువు, ప్రగతినగర్ చెరువు, సూరారం చెరువు, వెన్నెలగడ్డ చెరువు, చిన్నరాయుని చెరువు, పెద్ద రాయుని చెరువు, ఆస్మాన్ ట్యాంక్, సఫీగుడా చెరువుల్లో గణేశుడి నిమజ్జనం జరుగుతోంది. దాదాపు 50 వేల విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ గణేషుడి ఊరేగింపు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభంకానుంది.